'అట్లాస్' సైకిల్ కంపెనీ యజమాని భార్య ఆత్మహత్య!

  • అట్లాస్’ యజమాని సంజయ్ కపూర్ 
  • ఆయన భార్య నటాష్ కపూర్ (57)
  • ఢిల్లీలోని నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య
ప్రముఖ సైకిల్స్ తయారీ సంస్థ ‘అట్లాస్’ యజమాని సంజయ్ కపూర్ భార్య నటాష్ కపూర్ (57) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఢిల్లీలోని ఔరంగజేబు లైన్ లోని నివాసంలో నిన్న మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు ఇవాళ తెలిసింది.

సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని నటాష్ కపూర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. లోధీ రోడ్ లోని శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు సమాచారం. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించినట్టు ఓ వార్తా సంస్థ కథనం. నటాష్ కపూర్ ఆత్మహత్యకు పాల్పడ్డ సమయంలో ఆమె భర్త ఇంట్లో లేరని, కూతురు, కొడుకు మాత్రం ఉన్నట్టు ఆ కథనంలో పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె మృతదేహానికి గంగారామ్ ఆసుపత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించిన అనంతరం, నటాష్ మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులకు అప్పగించినట్టు పోలీసులు చెప్పారు.


Go Back to Shorts
Atlas
cycles
Sanjay kapur
wife
Natasha kapur

More Telugu News